: సీనియర్ నటి మనోరమకు ఛాతినొప్పి
ప్రఖ్యాత సీనియర్ సినీ నటి మనోరమకు ఛాతినొప్పి వచ్చింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న మనోరమ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను నిన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు యాంజియోప్లాస్టీ చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఐదు దశాబ్దాలుగా తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో పలు పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్న మనోరమ అస్వస్థతకు గురవ్వడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.