: సోనియా, రాహుల్ గాంధీల గుడ్డలూడదీస్తాం: బీజేపీ నేత రేగర్
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు ఎక్కువై పోయాయి. మోడీని ముక్కలు ముక్కలు చేస్తానని ఓ కాంగ్రెస్ నేత అన్న మాటలు మరచిపోకముందే మరో దుమారం రేగింది. బీజేపీ అధికారంలోకి వస్తే... సోనియా, రాహుల్ గాంధీల గుడ్డలూడదీసి వారిని ఇటలీకి పంపించేస్తామని బీజేపీ నేత హీరాలాల్ రేగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లోని టోంక్ నియోజకవర్గంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై దుమారం చెలరేగడంతో... క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనుంది.