: దిగ్విజయ్ సింగ్ ను కలిసిన తెలంగాణ నేతలు
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిగ్గీరాజాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దిగ్విజయ్ ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, వీహెచ్ తదితరులు ఉన్నారు.