: ఆహారం తిన్న 70 మంది విద్యార్థినులకు అస్వస్థత
కృష్ణాజిల్లా, విస్సన్నపేట మండల పరిధిలోని నర్సాపురం ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో 70 మంది విద్యార్థినులు అస్వస్థులయ్యారు. వారిని చికిత్స నిమిత్తం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆహారంలో బల్లి పడిందని... ఆ ఆహారాన్ని తీసుకోవడం వల్లే ఆస్పత్రిపాలయ్యారనే ఆరోపణలు వినవస్తున్నాయి.