: చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారు: కొణతాల


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత కొణతాల రామకృష్ణ మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాలను దక్కించుకుంటుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను తమ పార్టీ వాయిదా వేయాలని కోరడం లేదని ఆయన స్పష్టం చేశారు. అలా ఏ కోర్టులోనూ తమ పార్టీ పిటీషన్ దాఖలు చేయలేదని ఆయన చెప్పారు. కొన్ని చోట్ల పోలీసులు తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని, వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని కొణతాలు వెల్లడించారు. బైండోవర్ పేరుతో నేరచరిత లేని వ్యక్తులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. తొందర్లోనే వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విడుదల చేస్తుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News