: 28 లోక్ సభ స్థానాలకు 435 మంది పోటీ
కర్ణాటకలోని 28 లోక్ సభ స్థానాలకు 435 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒకే విడతలో ఏప్రిల్ 17న జరుగనున్న ఎన్నికల్లో వీరంతా పోటీ చేస్తున్నారని కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ కుమార్ ఝా తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ మొత్తం 28 స్థానాల్లో, జేడీ(ఎస్) 25 స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి. కాగా మొత్తం అభ్యర్థుల్లో 412 మంది పురుషులు కాగా, 23 మంది మహిళలు.