: ప్రేమ కోసం 93 ఏళ్ల వయసులో హత్య


ప్రేమ ఎంత మధురం...ప్రియురాలు అంత కఠినం అన్నాడో సినీ కవి. మధురమైన ప్రేమ కోసం 93 ఏళ్ల వయసులో ప్రియురాల్ని హత్య చేశాడని ఫ్రాన్స్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఫ్రాన్స్ లో రీమ్స్ పట్టణంలో మార్సెల్ తాతగా పిలుచుకునే మార్సెల్ డిల్లాట్(93) సెయింట్ గిల్లెస్ గ్రామానికి చెందిన నికోల్ ఎల్ డిబ్(82) అనే బామ్మమీద మనసుపడ్డాడు. ఆమెతో స్నేహం చేశాడు. ప్రేమించమని అర్థించాడు. కానీ ప్రియురాలు కఠినమవడంతో ఒప్పుకోలేదు.

దీంతో ఆగ్రహించిన మార్సెల్ ఆమెను తీవ్రంగా గాయపర్చి హతమార్చాడు. ఎల్ డిబ్ పొలం ప్రక్క కాలువలో ఛిద్రమైన ఆమె మృతదేహాన్ని 2011లో పోలీసులు కనుగొన్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బామ్మ ఇంట్లోని ఓ గడియారంపై మార్సెల్ రక్తం మరకలను గుర్తించిన పోలీసులు డీఎన్ఏ పరీక్ష చేయడంతో లోగుట్టు బయటపడింది.

అయితే ఎల్ డిబ్ తన గర్ల్ ఫ్రెండ్ అని, ఆమెను తానెందుకు చంపుతానని మార్సెల్ కోర్టులో వాదించినప్పటికీ అతను ఉద్దేశపూర్వకంగానే హత్యకు పాల్పడ్డాడని, కనీసం పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదని కోర్టు అభిప్రాయపడి, పదేళ్ల జైలు శిక్ష విధించింది.

  • Loading...

More Telugu News