: ప్రాణం తీసిన పోలీసు భయం
పోలీసులంటే ఉన్న భయం ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు తీసింది. విశాఖ జిల్లా నర్సీపట్నం ఊరి చివరి పొలాల్లో కొంత మంది విద్యార్థులు గత రాత్రి పార్టీ చేసుకున్నారు. పార్టీ రసవత్తరంగా సాగుతుండగా అక్కడికి పోలీసులు వస్తున్నట్టు సమాచారం అందింది. పోలీసులు తమను పట్టుకుని కటకటాల్లోకి తోస్తారనే భయంతో యువకులంతా పరుగులంకించుకున్నారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి నేల బావిలో పడిపోయాడు. బావి లోతుగా ఉండడంతో పడిపోయిన చంద్రశేఖర్ మృతి చెందాడు. అయితే అతడి మృతికి మద్యం పార్టీయే కారణమని భావించిన పోలీసులు, వాస్తవాలు వెలికితీసేందుకు దర్యాప్తు చేస్తున్నారు.