: ఐదేళ్ల విద్యార్థికి నగ్న శిక్ష
అల్లరి ఎక్కువగా చేస్తున్నాడంటూ ఐదేళ్ల విద్యార్థికి ఓ స్కూల్ టీచర్ చిత్రమైన శిక్ష విధించారు. హైదరాబాద్, టోలి చౌకీలోని ఓ స్కూల్లో టీచర్ సదరు విద్యార్థి బట్టలన్నీ విప్పేయించి గ్రిల్స్ ఉన్న గదిలో నిర్బంధించారు. తోటి విద్యార్థులు నవ్వుతుంటే ఆ చిన్నారి మనసు విలవిలలాడిపోయింది. దీనిపై స్కూల్ యాజమాన్యాన్ని మీడియా ప్రశ్నించగా... బాలుడి అల్లరి మితిమీరిపోతోందని, అతడిపై చర్యలు తీసుకోవాలని ఆమె తల్లే స్వయంగా తమకు ఫిర్యాదు చేసిందని, దాంతో ఆ శిక్ష విధించినట్లు యాజమాన్యం నుంచి సమాధానం వచ్చింది. దీనిపై బాలల హక్కుల సంఘం సెక్రటరీ అనురాధారావు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధమని, పోలీసులు స్వచ్చందంగా కేసు నమోదు చేయాలని ఆమె కోరారు. బాలల హక్కుల కమిషన్ దృష్టికి దీన్ని తీసుకెళతామన్నారు.