: మంగళవారం వరకూ బ్యాంకులకు సెలవులు


బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈ రోజు ఆదివారం. సోమవారం ఉగాది పర్వదినం. పైగా ఆర్థిక సంవత్సరం (2013-14) ముగింపు రోజు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతున్నందున ఖాతాలన్నీ సరిచూసుకుని అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది కనుక మంగళవారం బ్యాంకు సిబ్బంది పనిచేస్తారు. కానీ ఖాతాదారులకు సేవలకు అందవు. అయితే, ఆది, సోమవారాల్లో ఇంటర్నెట్ బ్యాంకు ద్వారా లావాదేవీలు జరుపుకోవడానికి అవకాశం కల్పించారు. వరుసగా సెలవులు రావడంతో ఏటీఎం యంత్రాల్లో నగదు నిల్వలను తగినంతగా ఉంచేందుకు బ్యాంకులు చర్యలు చేపట్టాయి.

  • Loading...

More Telugu News