: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయ్
రాష్ట్రంలో వేసవి ప్రారంభమైన కొద్ది రోజులకే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, రాజమండ్రిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. వరంగల్ లో 42, ఆదిలాబాద్, విజయవాడలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఇక, రాజధాని నగరం హైదరాబాదు, నిజామాబాదులో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదైంది.
భానుడి ప్రతాపానికి ప్రజలు సాయంత్రం వరకు ఇళ్లలోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం శీతల పానీయాలు, పళ్లరసాల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. కొబ్బరిబొండాలు, పుచ్చకాయల వ్యాపారులకు గిరాకీ పెరిగింది.