: వైదొలగే ప్రశ్నే లేదు... బీజేపీకి జస్వంత్ సింగ్ షాక్
నామినేషన్ ఉపసంహరించుకుని, పోటీ నుంచి వైదొలగే ప్రశ్నేలేదని బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి, సీనియర్ నేత జస్వంత్ సింగ్ తేల్చిచెప్పారు. రాజస్థాన్ లోని బర్మెర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. బీజేపీ సీనియర్ నేతలు ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే తనను ఎవరూ సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు.