: తాజ్ కృష్ణలో కిషన్ రెడ్డితో టీటీడీపీ నేతల భేటీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో హోటల్ తాజ్ కృష్ణలో తెలంగాణ టీడీపీ నేతలు ఎల్.రమణ, మోత్కుపల్లి, ఎర్రబెల్లి దయాకర్ రావు భేటీ అయ్యారు. తెలంగాణలో బీజేపీతో పొత్తుల అంశాన్ని ఆ ప్రాంత నేతలకే వదిలేసిన చంద్రబాబు వీరి ముగ్గురితో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. దాంతో, వారు సీట్ల సర్దుబాటు అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.