: ఎంపీ నవుతా!..: బాబూ మోహన్


లోక్ సభ అభ్యర్థిగా నిలవాలని ఉందని సీనీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ తన అభీష్టాన్ని వెల్లడించారు. హైదరాబాదులో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ, తనకు ఇతర పార్టీల నుంచి కూడా పిలుపు ఉందని అన్నారు. అయితే తనను ఎమ్మెల్యేను చేసింది కేసీఆర్ కనుక టీఆర్ఎస్ లో చేరుతానని, ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. అయితే ఏ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News