: అణగారిన వర్గాలకు అన్ని పార్టీలు అన్యాయం చేస్తున్నాయి: మందకృష్ణ
ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు అణగారిన వర్గాలకు అన్యాయం చేస్తున్నాయని మహాజన సోషలిస్టు పార్టీ అధినేత మంద కృష్ణమాదిగ ఆరోపించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం తాము పోరాటం చేశామని గుర్తు చేశారు. 2004 మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను పెట్టిందని... అనంతరం మరచిపోయిందని విమర్శించారు. 2009 లో బీసీలకు వంద సీట్లిస్తామని ప్రకటించిన చంద్రబాబు ఆ విషయాన్ని ఎలా మరచిపోయారని ప్రశ్నించారు. వామపక్షాలు కూడా పేదలను పట్టించుకోవడం మానేశాయని విమర్శించారు. తాను ఎమ్మెల్యే కావాలంటే ఏ పార్టీ అయినా టికెట్ ఇస్తుందని... కానీ, ఆ పార్టీ చెప్పుచేతుల్లో పని చేయాల్సి ఉంటుందని చెప్పారు.