: ప్రేమోన్మాది యాసిడ్ దాడి


ప్రేమ పెళ్లికి నిరాకరించిందని ఓ యువతి, ఆమె తల్లిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా రాజుపేటలో ఓ యువతిని ఓ యువకుడు ప్రేమించాడు. ఆమె పెళ్లికి నిరాకరించడంతో... ఆమెతో పాటు ఆమె తల్లిపై యాసిడ్ తో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News