: లాస్ ఏంజెలెస్ ను వణికించిన భూకంపం


మధ్యస్థాయి ప్రభావం గల భూకంపం అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగర వాసులను భయానికి గురి చేసింది. గత రాత్రి 9.11 గంటలకు వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. లాస్ ఏంజెలెస్ కు ఆగ్నేయంగా 32 కిలోమీటర్ల దూరంలోని ఆరెంజ్ కౌంటీ, బ్రీ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. గంట వ్యవధిలోనే మళ్లీ 3.6 పాయింట్ల తీవ్రతతో స్వల్ప భూకంపం వచ్చినట్లు పేర్కొంది. నష్టంపై ఇప్పటికి ఎలాంటి సమాచారం లేదు.

  • Loading...

More Telugu News