: పాక్ లో హనుమాన్ ఆలయానికి నిప్పు
పాకిస్థాన్ లోని లతీఫాబాద్ లో హనుమంతుడి ఆలయానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. సింధు ప్రావిన్స్ పరిధిలో ఉన్న ఈ ఆలయంలో ఏప్రిల్ 14న వార్షిక ఉత్సవాలు జరగనున్నాయి. ఈలోపు దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. నిన్న ముగ్గురు వ్యక్తులు గుడికి వచ్చి దేవుడిని దర్శించుకున్న అనంతరం విగ్రహాన్ని ధ్వంసం చేసి.. కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయినట్లు పోలీసులకు ఆలయ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. స్థానికంగా 600 వరకు హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ఘటన తర్వాత వారు నిరసనకు దిగారు.