: గత పదేళ్లలో లక్షల కోట్లు తరలించారు: ముద్దుకృష్ణమనాయుడు
టీడీపీ నేత ముద్దుకృష్ణమనాయుడు ఈ రోజు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత పదేళ్లలో రాష్ట్రం దోపిడీకి గురైందని, నల్లధనాన్ని విదేశాలకు తరలించారని ఆరోపించారు. రూ. 85 లక్షల కోట్ల బ్లాక్ మనీ విదేశాల్లో ఉందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నా... యూపీఏ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అన్నారు. యూపీయే పదేళ్ల పాలనలో పేదల బతుకులు మరింత దిగజారాయని విమర్శించారు.