: ముగిసిన మున్సి‘పోల్స్’ ప్రచారం
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ, ఆదివారం నాడు జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు ప్రచార పర్వం ఇవాళ్టితో ముగిసింది. మొత్తం 10 కార్పొరేషన్లు, 146 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రచార గడుపు పరిసమాప్తమవడంతో ఇక ఎక్కడా సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, అలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.