: పొత్తులపై తుది దశకు చేరిన టీడీపీ, బీజేపీ చర్చలు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, బీజేపీల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ మేరకు చివరిసారిగా చంద్రబాబు, ప్రకాశ్ జవదేకర్ భేటీ అయ్యారు. నిన్నటి నుంచి ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ అడిగిన సీట్లకు తెలుగుదేశం పార్టీ ఒప్పుకుందని తెలుస్తోంది. పొత్తుల ఖరారుకు సంబంధించి ఈ రోజు ప్రకటన వెలువడే అవకాశం ఉంది.