: ఆప్ 12వ జాబితాలో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు


లోక్ సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పోటీ చేయాలని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా 12వ జాబితా విడుదల చేసింది. ఈ మేరకు 35 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది. ఈసారి జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీకి దింపుతున్న తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను కూడా తెలిపింది. ఈ జాబితాతో ఆప్ తరపున ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 385కు చేరింది.

ఏపీ నుంచి పోటీ చేస్తున్న వారి వివరాలు:- నిజామాబాద్ - రాపెల్లె శ్రీనివాస్, మల్కాజ్ గిరి - చందనా చక్రవర్తి, వరంగల్ - చింతా స్వామి, సికింద్రాబాద్ - ఛాయ రతన్, చేవెళ్ల - రేగట్టె వెంకట రెడ్డి, గుంటూరు - కెవిబి వీర వరప్రసాద్, శ్రీకాకుళం - జయదేవ్ ఇంజారపు, బాపట్ల - ఈడీఏ చెన్నయ్య, ఒంగోలు - సీఎస్ఎన్ రాజా యాదవ్ పోటీ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News