: సోనియాపై పోటీ చేసేందుకు ఉమా భారతి తిరస్కరణ


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి తిరస్కరించారు. తాను ఝాన్సీ స్థానాన్ని వీడనని తేల్చిచెప్పారు. దాంతో, కొన్ని రోజులుగా సోనియాపై భారతి పోటీకి దిగుతున్నారంటూ వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పెట్టారు. అయితే, బరేలీ నుంచి పోటీ చేయమని పార్టీ ఆదేశిస్తే గౌరవించి పోటీ చేస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News