: మోడీ ప్రభంజనానికి కాంగ్రెస్ భయపడుతోంది: ప్రకాశ్ జవదేకర్
నరేంద్ర మోడీ ప్రభంజనాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని, అందుకే మోడీపై అసత్య ప్రచారానికి ఆ పార్టీ దిగుతోందని భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ కూడా ఎంఐఎం పార్టీలాగే వ్యవహరిస్తోందని, చౌకబారు విమర్శలకు దిగుతోందని అన్నారు. మోడీపై మసూద్ చేసిన విమర్శలు కాంగ్రెస్ అసలు రూపానికి నిదర్శనమని ఆయన అన్నారు.