: పోలీసుల తనిఖీల్లో స్టీల్ బిందెలు పట్టివేత
ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు పలుచోట్ల నిర్వహిస్తున్న తనిఖీలలో డబ్బుతో పాటు పలురకాల వస్తువులు కూడా పట్టుబడుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంక చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో లారీలో తరలిస్తున్న వెయ్యి స్టీల్ బిందెలను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వాటిని స్టేషన్ కు తరలించారు.