: స్థూలకాయం తగ్గాలంటే ఇది తినండి చాలు...!
నవీనకాలంలో స్థూలకాయం పెద్ద సమస్యైకూర్చుంది. ఫలితంగా చిన్న వయసులోనే శరీరభారంతో ఆపసోపాలు పడుతున్నారు. ఈ అవస్థలు పడుతోన్న వారికి ఇప్పుడో విరుగుడు మందు దొరికింది. చేయాల్సిందల్లా ఉదయాన్నే ప్రోటీన్స్ తోకూడిన బలవర్థకమైన అల్పాహారం లాగించేయడమే! ఇదేంటి.. అసలే తిండెక్కువైతే మళ్లీ ఇది అదనమా అనుకుంటున్నరా..?
అదేం లేదండి.. ఒక్కసారి ప్రొటీన్స్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ చేశాక ఇక సాయంత్రం వరకూ ఆకలి వేయదట. అంతేకాదు, షుగర్, కొవ్వు తోకూడిన స్నాక్స్ ఇక అస్సలు తినాలనిపించదట. దీంతో స్థూలకాయం త్వరలోనే అదుపులోకి వచ్చి నాజూగ్గా తయారవుతారు.
ఈ విషయాన్ని అమెరికాలోని న్యూట్రిషన్ శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ హీదర్ లైడీ కరాఖండీగా చెబుతున్నారు. 18-20 ఏళ్ల స్థూలకాయ యువతుల మీద అధ్యయనం చేసి, వారి ఆహార అలవాట్లను పరిశీలించిన మీదటే హైడీ ఈ నిర్ణయానికొచ్చారట.

సో... స్థూలకాయ బాధితులూ.. ఈ చిట్కా అనుసరిస్తే సరి!