: రూ. 85 వేల అద్దె కట్టమంటూ కేజ్రీవాల్ కు నోటీసు


ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా నెలరోజులకు పైగా ప్రభుత్వం ఇచ్చిన ఫ్లాట్ లోనే ఉంటున్నందుకు నెలకు రూ. 85 వేల చొప్పున అద్దె కట్టాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మేలో తన కుమార్తె పరీక్షలు అయ్యేంత వరకు సెంట్రల్ ఢిల్లీలోని తిలక్ లేన్ లో ఉన్న సి 11/23 ఇంట్లో ఉండేందుకు పొడిగింపును కోరుతూ కేజ్రీవాల్ గతంలోనే ఢిల్లీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ కు చెందిన ప్రత్యేక కార్యదర్శి పేరిట కేజ్రీవాల్ కు నోటీసు జారీ అయింది.

  • Loading...

More Telugu News