: విజయవాడలో ‘‘మహిళా గర్జన’’ మొదలైంది
విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘‘మహిళా గర్జన’’ సభ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సభకు భారీ సంఖ్యలో మహిళలు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సభలో టీడీపీ అధినేత పాల్గొని పార్టీ విధి విధానాలను ప్రజలకు వివరించనున్నారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న చంద్రబాబు సభా వేదిక వద్దకు ర్యాలీగా బయల్దేరారు. కొద్దిసేపటిలో ఆయన సింగ్ నగర్లోని ‘మహిళా గర్జన’ వేదిక వద్దకు చేరుకోనున్నారు.