: సఫారీలను వణికించిన పసికూనలు
టి20 వరల్డ్ కప్ లో సంచలనం తృటిలో తప్పిపోయింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ పోరాడి ఓడింది. 146 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ కూనలు 18.4 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో చివరికి 6 పరుగుల తేడాతో నెగ్గిన సఫారీలు ఊపిరిపీల్చుకున్నారు. నెదర్లాండ్స్ జట్టులో ఓపెనర్ మైబర్గ్ 51 పరుగులతో రాణించాడు. సఫారీ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ 4, స్టెయిన్ 2 వికెట్లు తీశారు.