: ఎన్నికల సంఘానికి నిఘావేదిక సూచనలు
ఎన్నికల నిఘావేదిక సంస్థ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు గాను ఎన్నికల సంఘానికి కొన్ని సూచనలు చేసింది. వేదిక ప్రతినిధులు ఈరోజు (బుధవారం) రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ను కలిసి ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. అవేంటంటే...
>> మండలానికి పది బృందాలను ఏర్పాటు చేసి నగదు, మద్యం పంపిణీని గ్రామస్థాయిలో నివారించాలి.
>> బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపాలి.
>> ఓటరు చైతన్య సభలను నిర్వహించాలి
>> తొలిసారిగా ప్రవేశపెడుతున్న తిరస్కరణ ఓటుపై ఓటర్లకు అవగాహన కల్పించాలి.
>> డమ్మీ ఈవీఎంలతో తిరస్కరణ ఓటు వేసే విధానాన్ని ప్రజలకు వివరించాలి.