: సఫారీలకు బౌలింగ్ పదును రుచి చూపిన పసికూనలు
అంతర్జాతీయ క్రికెట్లో పసికూన అనదగ్గ నెదర్లాండ్స్ జట్టు టీ20 వరల్డ్ కప్ లో నేడు బలమైన దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆరెంజ్ దళం (నెదర్లాండ్స్) చక్కని బౌలింగ్ తో సఫారీ బ్యాట్స్ మెన్ ను నియంత్రించింది. టాపార్డర్ లో ఆమ్లా (43) మినహా ఎవరూ భారీ స్కోర్లు నమోదు చేయలేదు. దీంతో, 16.5 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 127 పరుగులు చేసింది.