: పురంధేశ్వరికి సీటివ్వకండని చంద్రబాబు నాతో చెప్పలేదు: వెంకయ్యనాయుడు


ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన పురంధేశ్వరికి సీటు ఇవ్వరాదని తనతో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పలేదని బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మా ఇద్దరి మధ్య అలాంటి చర్చ కూడా రాలేదని చెప్పారు. అంతేకాకుండా, మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తనతో టచ్ లో లేరని... మరెవరితోనైనా టచ్ లో ఉన్నారేమో తనకు తెలియదన్నారు. బొత్స బీజేపీలో చేరబోతున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News