: తగ్గనున్న పెట్రోల్ ధర
వచ్చే వారం పెట్రోల్ ధర తగ్గే అవకాశముంది. డాలర్ తో రూపాయి బలపడడం, ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో లీటర్ పెట్రోల్ పై రూ.1 ధర తగ్గనున్నట్టు తెలుస్తోంది. సవరించిన ధరలను చమురు సంస్థలు ఈ నెల 31న ప్రకటిస్తాయి. కాగా, డీజిల్ ధర 50 పైసలు పెరిగే అవకాశముంది.