: కూలిపోయిన హర్యానా గవర్నర్ హెలికాప్టర్
హర్యానా గవర్నర్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. గవర్నర్ జగన్నాథ్ పహాడియా ఉన్న హెలికాప్టర్ చండీగఢ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకుంటుండగా కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి గవర్నర్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. పరీక్షల నిమిత్తం గవర్నర్ ను విమానాశ్రయ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అరగంటపాటు రన్ వేను అధికారులు మూసివేశారు. అనంతరం విమానాల రాకపోకలను అనుమతించారు.