: మావోయిస్టులపై మోడీ ధ్వజం
బీహార్లో నేడు తన సభల నేపథ్యంలో నక్సల్స్ సెల్ టవర్లు పేల్చేయడంపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యల ద్వారా మావోయిస్టులు ప్రజాస్వామ్యాన్నే సవాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. లోహర్ దాగా సభలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం తుపాకీ కంటే శక్తిమంతం అని పేర్కొన్నారు. తన సభలకు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు మావోయిస్టులు పేలుళ్ళకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. అయితే, సభకు భారీ ఎత్తున హాజరైన ప్రజాసందోహం తుపాకీతో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోలేరన్న వాస్తవాన్ని చాటిచెప్పిందని ఉద్ఘాటించారు. గయ జిల్లాలో మావోయిస్టులు రెండు సెల్ టవర్లను బాంబులతో పేల్చివేయడం తెలిసిందే.