: నేడు లంకతో ఇంగ్లండ్ అమీతుమీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తోన్న టీ20 వరల్డ్ కప్ లో నేడు శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. లంక జట్టు నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాపై విజయంతో ఊపుమీదుండగా, ఇంగ్లండ్ జట్టు కివీస్ చేతిలో పరాజయంతో కసిమీదుంది. కాగా, మరో మ్యాచ్ లో పసికూన నెదర్లాండ్స్ బలమైన సఫారీ జట్టుతో ఢీకొనేందుకు సిద్ధమైంది. ఈ రెండు మ్యాచ్ లకు చిట్టగాంగ్ లోని జహూర్ అహ్మద్ స్టేడియం వేదికగా నిలుస్తోంది.