: పవన్ కల్యాణ్ ఓ స్టార్ హీరో మాత్రమే: టి.సుబ్బిరామిరెడ్డి
పవన్ కల్యాణ్ కు రాజకీయ అనుభవం లేదని, పవన్ కల్యాణ్ ఓ స్టార్ హీరో మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి (టీఎస్ఆర్) అన్నారు. ఈరోజు (గురువారం) ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం అంతగా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏనాడు కనీసం సభలు, సమాజ సేవా కార్యక్రమాలకు హాజరుకాని పవన్ కల్యాణ్ పార్టీ పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి ఓ శక్తి అని, ఆయనను ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదని టీఎస్ఆర్ అన్నారు. పవన్ తన ఆలోచనా భావాలకు అక్షర రూపమిచ్చిన ‘ఇజం’ పుస్తకాన్ని ఈరోజు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ ఆడిటోరియంలో ఆవిష్కరించనున్నారు.