: డబ్బులివ్వలేదని ప్రయాణికులపై హిజ్రాల దాడి


వరంగల్-విజయవాడ మార్గంలో రైళ్లలో హిజ్రాల ఆగడాలు పెరిగిపోయాయి. రైళ్లలోకి ఒక గ్రూపుగా ఎక్కడం బలవంతంగా ప్రయాణికుల నుంచి డబ్బులు వసూళ్లు చేయడం వారికి ఓ దందాగా మారిపోయింది. తాజాగా డబ్బులివ్వలేదంటూ గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికులపై హిజ్రాలు దాడి చేశారు. నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దీనిపై ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే 10 రూపాయలకు తక్కువ కాకుండా హిజ్రాలకు సమర్పించుకోవాల్సిన దారుణ పరిస్థితి నెలకొన్నా... రైల్వే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News