: రచ్చకెక్కిన మెగా హీరోల ఆధిపత్య పోరు


పవన్ కల్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్... వీరంతా మెగా ఫ్యామిలీ హీరోలు. వీరిలో అందరికీ వేరు వేరు అభిమాన సంఘాలున్నాయి. అయితే మెగా హీరోల ఫంక్షన్ ఏదైనా సరే అభిమానులందరూ ఒక్కటైపోయేవారు. కానీ, పవన్ కల్యాణ్ జనసేన స్థాపించి... తన అన్న పార్టీ అయిన కాంగ్రెస్ నే తరిమి కొట్టండంటూ పిలుపునిచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. కాంగ్రెస్ ను తరిమికొట్టండని పిలుపునివ్వడమంటే... సాక్షాత్తూ తన అన్నపైనే తొడగొట్టడం లాంటిది మరి. ఈ విషయంలో రాంచరణ్ చాలా డిస్టర్బ్ అయ్యాడని... పవన్ దూకుడును భరించలేకపోతున్నాడని సమాచారం. సాక్షాత్తు తన తండ్రినే ఎదిరించే స్థాయికి బాబాయ్ ఎదగడాన్ని తట్టుకోలేకపోతున్నాడని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ రోజు మెగా ఫ్యామిలీకి సంబంధించి రెండు వేర్వేరు ఫంక్షన్లు జరుగుతున్నాయి. ఒకటి హైదరాబాదులో రాంచరణ్ బర్త్ డే అయితే, రెండోది వైజాగ్ లో జనసేన భారీ బహిరంగ సభ. ఇంతకాలం కలసి కట్టుగా ఉన్న మెగా ఫ్యామిలీ అభిమానులకు ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది చిరును వదిలి పూర్తిగా పవన్ పంచన చేరిపోగా... మరికొంత మంది తాము చిరంజీవి వెంటే అంటూ చెర్రీ బర్త్ డే కోసం హైదరాబాద్ వచ్చేశారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు వైజాగ్ లో జరుగుతున్న జనసేన సభను అల్లకల్లోలం చేస్తామంటూ నిర్వాహకులకు మెస్సేజ్ లు వచ్చాయి. ఈ వ్యవహారం వెనుక రాంచరణ్ అభిమానులున్నారని భావిస్తున్నారు. అంతేకాకుండా డైరెక్ట్ గా చిరంజీవి హస్తం కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మెగా ఫ్యామిలీ ఆధిపత్య పోరు వీధిన పడిందనే చెప్పుకోవాలి. ఇంతకాలం అంతర్గతంగా ఏమున్నప్పటికీ... బయట మాత్రం ఎక్కడ లేని అనుబంధాలను ప్రదర్శించిన మెగా ఫ్యామిలీ... ప్రస్తుతం నిట్టనిలువునా చీలిపోయిందనేందుకు ఇంతకన్నా మరో ఉదాహరణ ఏముంటుంది?

  • Loading...

More Telugu News