: ముంబై నుంచి రాఖీ సావంత్ పోటీ


భారత ఎన్నికల సంగ్రామంలోకి మరో నటి అడుగుపెట్టనుంది. బాలీవుడ్ ఐటం బాంబు రాఖీ సావంత్ గురించి తెలియని వారుండరు. టీవీలో స్వయంవరం పెట్టినా, సంచలన వ్యాఖ్యలు చేసినా ఆమెకు ఆమే సాటి. అలాంటి రాఖీ సావంత్ ఈశాన్య ముంబై లోక్ సభ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. 'నేను పెరిగిన చోటే పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. రెండు మూడు రోజులలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏ పార్టీకి నా మద్దతనేది తెలియజేస్తా' అని రాఖీ సావంత్ తెలిపింది. కేజ్రీవాల్ కంటే తానే గొప్ప నేతనని నిరూపించుకుంటానంది. 'నేను బాలీవుడ్ మిరపకాయ. నేతలందరికీ మిర్చీ ఘాటు తగిలిస్తా. ప్రభుత్వం ఇబ్బందులు పెడితే వారిపై మిరపకాయలను విసురుతా'నంటూ వింతగా చెప్పింది.

  • Loading...

More Telugu News