: అధిష్ఠానం ఎంపీగా పోటీ చేయమంది...ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నా: కన్నా
అధిష్ఠానం తనను ఎంపీగా పోటీ చేయమని ఆదేశించిందని, తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అధిష్ఠానానికి చెప్పానని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, తాను పార్టీని వీడేది లేదని అన్నారు. తన అభిప్రాయానికి అధిష్ఠానం ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కన్నా స్పష్టం చేశారు.