: కాసులు కొల్లగొడుతున్న ధోనీ బ్రాండ్!
టీమిండియా క్రికెట్ గురించి చెప్పుకోవలసి వచ్చినప్పుడు 'ధోనీ ముందు తర్వాత' అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే భారత జట్టుకు అత్యధిక విజయాలు ఈ జార్ఖండ్ డైనమైట్ వల్లే సంప్రాప్తించాయి. టీమిండియాలోకి ఈ కుర్రాడు వచ్చీరావడంతోనే విజయాలు సొంతం చేసుకోవడంతో, ఒక్కసారే పేరు, ప్రతిష్ఠలు పెరిగిపోయాయి. ధోనీ బ్రాండ్ విలువా అమాంతం పెరిగింది. పలు కంపెనీలు ధోనీకీ కాసుల వర్షాన్ని
కురిపిస్తున్నాయి. దీంతో ఆటగాడిగా పొందే సంపాదనకన్నా, ధోనీ వాణిజ్య ప్రకటనల
ద్వారా పొందే ఆదాయమే ఎక్కువట. దీంతో ఈ విజయాల సారథి సంపాదనలో
పలువురుని వెనక్కునెట్టి టాప్ ప్లేస్ లో నిలిచాడు.
సాధారణంగా ఆటగాళ్లు ఎంత బాగా ఆడితే అంతపేరు, అంతేస్థాయిలో ప్రకటనలూ వస్తుంటాయి. ప్రపంచ స్టార్ క్రీడాకారులుగా రాణిస్తున్న నాదల్, ఫెడరర్, సెరెనా, టైగర్ ఉడ్స్, రొనాల్డో.. వంటి వారు సంవత్సరానికి వందలకోట్లు ఆర్జిస్తున్నారు. కానీ, ఇంతవరకూ క్రికెట్లో ఇలా నాలుగుచేతులా సంపాదించిన క్రీడాకారుడే లేడు. క్రికెట్ లో దేవుడుగా ఆరాధించే సచిన్ కు సైతం ఇది సాధ్యంకాలేదు. అయితే, తక్కువ సమయంలోనే జట్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి, ఏడాదికి వందకోట్లు సంపాదిస్తున్న క్రీడాకారుడిగా ధోనీ ఒక్కడే రికార్డు సృష్టించాడు. దీంతో ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన ప్రపంచ సంపన్నుల క్రీడాకారుల జాబితాలో మహేంద్రుడు 31వ స్థానం దక్కించుకున్నాడు.
మూడేళ్ల కిందట మహీ ఒక్కో ప్రకటనకు 3 కోట్ల వరకు తీసుకుంటే...ఇప్పుడు 10 కోట్లు తీసుకుంటున్నాడట. ఆ లెక్కన ఆలోచించండి మరి ... సంవత్సరం మొత్తానికి ఎంత ఆదాయం వస్తుందో! ప్రస్తుతం 17 కంపెనీ ఉత్పత్తులకు ధోనీ ప్రచారం చేస్తున్నాడు. ఇందులో అన్నీ బడా కంపెనీలే. ఇక సంవత్సరాల వారీగా చూస్తే.. ధోనీ ఆదాయం గతేడాది రూ.143
కోట్లు ఉంది. ఇందులో కేవలం ఎండార్స్ మెంట్ల ద్వారానే 127 కోట్లు వచ్చింది.
ఇది మాస్టర్ సంపాదన కంటే దాదాపు 40 శాతం అధికమట. ఇందులో తాజా ఒప్పందాలు,
ఇతర ఆదాయాలను కలపనేలేదు సుమా!

మూడే