: సన్నీలియోన్ ని దేశం నుంచి వెళ్లగొట్టండి: హిందూ జన్ జాగృతి సమితి
సన్నీలియోన్ పై దేశబహిష్కరణ విధించి, రాగిణి ఎంఎంఎస్ 2 సినిమాను నిషేధించాలని హిందూ జన్ జాగృతి సమితి డిమాండ్ చేసింది. రాగిణి ఎంఎంఎస్ 2 సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్ సీ)కి హిందూ జన్ జాగృతి సమితి మెమొరాండం సమర్పించింది. నిషేధం విధించని పక్షంలో ఈ సినిమా విడుదల చేసే థియేటర్ల వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించింది. హిందువులు పవిత్రంగా భావించే శ్రీ హనుమాన్ చాలీసా మంత్రంతో ఈ సినిమా ప్రారంభం అవుతుందని, దాని వల్ల మత ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని సమితి సభ్యులు పేర్కొంటున్నారు.