: గవర్నరు ఉగాది వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్
ఉగాది పండుగ చేసుకోవడానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి ఏటా ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం ఉంటుంది. అధికారికంగా అయితే, ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో పాటు గవర్నర్ కూడా కార్యక్రమంలో పాల్గొనేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉండటంతో గవర్నర్ అధికారికంగా ఈ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. ఎన్నికల కోడ్ ఉండటంతో ఈ పండుగ మీద కూడా అనిశ్చితి ఏర్పడింది. అయితే, రాజకీయ నేతల గురించి, రాజకీయాల గురించి ప్రస్తావించకుండా ఉగాది వేడుకలు జరుపుకోవచ్చని గవర్నరు నరసింహన్ కు ఎన్నికల సంఘం సూచించింది. అలాగే ఉగాది ఉత్సవాల్లో అధికారులు కూడా పాల్గొనేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.