: కేజ్రీవాల్ పై నా అభిప్రాయం అదే: షిండే
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై తన అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదని, రెణ్ణెల్లకిందట చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. గత జనవరిలో షిండే... కేజ్రీనుద్దేశించి 'యేడా ముఖ్యమంత్రి' అని మరాఠీలో వ్యాఖ్యానించారు. 'పిచ్చి ముఖ్యమంత్రి' అని దానర్థం. ఈ విషయమై షిండేను ఓ రిపోర్టర్ కదపగా, 'నేనొక్కసారి చెబితే ఇక దానికి కట్టుబడి ఉంటా. మరోసారి చెప్పను. అయినా, దేశమంతా అతన్ని గమనిస్తూనే ఉందిగా' అని బదులిచ్చారు.
ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని అతడిని సీఎం పీఠం ఎక్కిస్తే అతను రోడ్లపై కూర్చుని నిరసనలకే పరిమితం అయ్యాడని షిండే విమర్శించారు. 'ఏ రాజ్యాంగం కూడా ఇలాంటివి అనుమతించదు. ఇలాంటి పరిస్థితుల్లో అతడిని ఏమనాలి? యోధుడనాలా? పిచ్చివాడనాలా?' అని ప్రశ్నించారు.