: సూర్యలంక బీచ్ ఫెస్టివల్ కు రూ.12 లక్షలు మంజూరు
గుంటూరు
జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంకలో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ కు
కేంద్రమంత్రి చిరంజీవి రూ.12 లక్షలను మంజూరు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర
సహాయమంత్రి పనబాక లక్ష్మి ఈ ఉదయం బాపట్లలో మీడియాకు తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం మే నెలలో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. దీనికి 'భావపురి-సూర్యలంక బీచ్ ఫెస్టివల్' పేరు పెట్టామన్న పనబాక, ముగింపు కార్యక్రమానికి చిరంజీవి హాజరవుతారని తెలియజేశారు.