: జెడ్పీటీసీ, ఎంపీటీసీలపై రేపు ఆదేశాలిస్తామన్న సుప్రీంకోర్టు


జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు రేపు ఆదేశాలిస్తామని తెలిపింది. ఏప్రిల్ 8న శ్రీరామ నవమి పండుగ ఉందని కోర్టుకు ఈసీ తెలిపింది. ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించడానికి అభ్యంతరం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా, 9న పదవ తరగతి పరీక్షలు ఉన్నాయని ఈసీ తెలిపింది. దీంతో రేపు తుది ఆదేశాలను ఇస్తామని కోర్టు వెల్లడించింది.

  • Loading...

More Telugu News