: మేడారం అడవిలోని కార్చిచ్చును ఆర్పేశారు


వరంగల్ జిల్లా తాడ్వాయి మండల పరిధిలోని మేడారం అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. సమ్మక్క-సారక్క జాతర జరిగే చిలుకలగుట్ట వరకు కార్చిచ్చు వ్యాపించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ, దేవాదాయ శాఖ అధికారులు అగ్నిమాపక దళాన్ని రప్పించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. చిలుకలగుట్టలో మంటలను పూర్తిగా ఆర్పివేసినట్లు ఫైర్ సిబ్బంది చెప్పారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన వారు నిప్పంటించడం వల్లే మంటలు చెలరేగినట్టు పూజారి జగ్గారావు తెలిపారు. మళ్లీ అగ్నిప్రమాదం జరుగకుండా ముందుజాగ్రత్తగా దేవాదాయ శాఖాధికారులు చిలుకలగుట్ట చుట్టూ ఉన్న ప్రహరీ గోడకు తాళం వేశారు.

  • Loading...

More Telugu News