: గురుదాస్ పూర్ ఎన్నికల బరిలో బాలీవుడ్ స్టార్


బాలీవుడ్ వెటరన్ హీరో వినోద్ ఖన్నా మరోమారు ఎన్నికల బరిలో దిగుతున్నారు. బీజేపీ టికెట్ పై ఆయన పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే పోటీ చేసిన వినోద్ ఖన్నా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతాప్ సింగ్ బాజ్వా చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. నిన్న రాత్రి బీజేపీ ప్రకటించిన తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లలో ఈ సూపర్ స్టార్ పేరు కూడా ఉంది.

కాగా, వినోద్ ఖన్నా 1997లో బీజేపీలో చేరారు. ఈ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో గురుదాస్ పూర్ నుంచి గెలుపొందారు. అనంతరం 1999లో జరిగిన ఎన్నికల్లోనూ నెగ్గారు. ఇక, 2002లో కేంద్రంలో సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆరు నెలల తర్వాత ఎంతో కీలకమైన విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం విశేషం. 2004లోనూ గురుదాస్ పూర్ నుంచి విజయబావుటా ఎగరేసిన వినోద్ ఖన్నా, ఆ తర్వాతి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.

  • Loading...

More Telugu News