: ముజఫర్ నగర్ మత ఘర్షణలపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీం నో
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ మత ఘర్షణల కేసులో సీబీఐ దర్యాప్తుగానీ, సిట్ దర్యాప్తుగానీ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతేడాది సెప్టెంబర్ లో ముజఫర్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున మతఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో 50 నుంచి 60 మంది వరకూ మరణించారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నిఘా సంస్థలు అల్లర్ల విషయమై సమాచారాన్ని ముందుగానే ఇచ్చి ఉంటే వాటిని నిరోధించగలిగేవారని చీఫ్ జస్టిస్ సదాశివం ఆధ్వర్యంలోని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. అల్లర్లలో ప్రాథమిక నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొంది. ఘర్షణల సందర్భంగా లైంగిక వేధింపులకు గురైన మహిళలకు రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలని, అది కూడా మతం ఆధారంగా కాకుండా నిజమైన బాధితులకు ఇవ్వాలని ఆదేశించింది.